DK Aruna: మిషన్‌ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చేశారు: డీకే అరుణ

రాష్ట్రంలో మిషన్‌ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.

Published : 30 Jul 2023 18:08 IST

నిజామాబాద్‌: రాష్ట్రంలో మిషన్‌ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. వరద బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకం పనులు చేపట్టారని దుయ్యబట్టారు. నాణ్యత పాటించకపోవడం వల్లే చెరువులకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ‘‘ వరదల బారిన పడిన రైతుల వద్దకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది లేదు. పరామర్శ చేసిందీ లేదు. చెక్ డ్యాంల నిర్మాణాల లోపాల వల్లే వందలాది ఎకరాలు నిట మునిగాయి. రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నష్ట పరిహారం వెంటనే అందించాలి’’ అని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని