Harish Rao: భారాస పోరాటానికి భయపడే.. సీఎం ప్రకటన: హరీశ్‌రావు

ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. 

Published : 15 Apr 2024 22:21 IST

హైదరాబాద్‌: ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీపై భారాస చేస్తున్న పోరాటానికి భయపడే రేవంత్‌ ప్రకటన చేశారన్నారు. ఎకరానికి రూ.15, 000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంకా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. ఇచ్చిన హామీలపైనే చిత్తశుద్ధిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త హామీలిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని