విశాఖ కేంద్రంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

రాజధాని మార్పు వ్యవహారాల్లో విశాఖను కేంద్రంగా చేసుకొని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరుగుతోందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు.  ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో...

Published : 05 Jan 2020 01:33 IST

మాజీ ఎంపీ రాయపాటి

గుంటూరు: రాజధాని మార్పు వ్యవహారాల్లో విశాఖను కేంద్రంగా చేసుకొని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరుగుతోందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు.  ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో భూములను నోటిఫై చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్‌ ట్రేడింగ్ జరిగితే డబ్బులు రావని అందుకే విశాఖ వెళ్లి అక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

వైకాపా మంత్రులు, నాయకులు, కార్యకర్తలు విశాఖలో భారీగా భూములు కొన్నారని చెప్పారు. అక్కడ కూడా రాజధాని తీసేసి కర్నూలు వెళితే భూములు కొన్న వారు విషం తాగి చనిపోవాల్సిందేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ముఖ్య సలహాదారులే ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. అందువల్లే ఆయన రాంగ్ ట్రాక్‌లో పయనిస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబుపై కక్ష్య సాధింపులో భాగంగానే జగన్ రాజధానిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాయపాటి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని