‘కార్గో’పై నా ఫొటో వేయొద్దు: కేసీఆర్‌

సరకు రవాణా చేసే కార్గో బస్సులపై తన ఫొటో పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరిగిన ప్రచారంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఆ ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీ లాభాల్లో పయనించాలన్నదే...

Published : 04 Feb 2020 19:24 IST

హైదరాబాద్‌: సరకు రవాణా చేసే కార్గో బస్సులపై తన ఫొటో పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరిగిన ప్రచారంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఆ ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీ లాభాల్లో పయనించాలన్నదే తన లక్ష్యమన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని.. ఫొటో ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప.. దాంతో చౌకబారు ప్రచారం పొందడం తన అభిమతం కాదని అధికారుకులకు సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అభిప్రాయంతో ఆర్టీసీ ఎండీకి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి నోట్‌ పంపారు. కార్గో బస్సులపై తన ఫొటో వేయొద్దని సీఎం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని