వాస్తవాలకు దూరంగా గవర్నర్‌ ప్రసంగం:భట్టి

ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ గవర్నర్‌ ప్రసంగంలో...

Published : 06 Mar 2020 20:40 IST

హైదరాబాద్‌: ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ గవర్నర్‌ ప్రసంగంలో లేదన్నారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని పేర్కొన్నారు. రెండు పడకల ఇళ్లపై ఆరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మాట చెబతోందని భట్టి మండిపడ్డారు. పోడు భూములు, ఎస్సీ, ఎస్టీ నిధులపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావన రాలేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు పథకాలు కేవలం ఎన్నికల ఆయుధాలుగా మారాయని వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ నీరు రాలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లు పిలవకపోవడం.. నామినేషన్‌ పద్ధతిలో రూ. 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఇవ్వడంపై అసెంబ్లీలో చర్చ జరపాలని భట్టి డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై చర్చించాలన్నారు. సమస్యల పరిష్కారంపై చర్చకు అసెంబ్లీ సమయాన్ని పొడిగించాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని