వారికి పూర్తి వేతనం చెల్లించండి:జీవన్‌రెడ్డి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యుత్‌ శాఖను కూడా అత్యవసర సేవల కిందికి  తీసుకురావాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Published : 13 Apr 2020 00:28 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యుత్‌ శాఖను కూడా అత్యవసర సేవల కిందికి  తీసుకురావాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పోలీసు, వైద్యఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికుల మాదిరిగానే విద్యుత్‌శాఖ ఉద్యోగులను కూడా అత్యవసర సేవల సిబ్బందిగా గుర్తించాలని కోరారు. రాత్రీ పగలు తేడా లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సీఎంకు రాసిన లేఖ ప్రతులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సింగరేణి ఎండీ శ్రీధర్‌, ఆర్థిక, ఇంధన శాఖల కార్యదర్శులకు పంపారు. మార్చి నెల వేతనంలో కోత విధించిన ప్రభుత్వం.. భవిష్యత్తులోనూ దాన్ని కొనసాగించే అవకాశముందనే ఆందోళన ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని