కూలీలను సొంతూళ్లకు పంపలేం: సుచరిత

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్‌జోన్లలో నివసించే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు అమరావతి సూపర్‌ మార్కెట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ సూపర్‌ మార్కెట్‌ను...

Updated : 17 Apr 2020 15:09 IST

గుంటూరు: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్‌జోన్లలో నివసించే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు అమరావతి సూపర్‌ మార్కెట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ సూపర్‌ మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు. వారికి ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. ఈ సందర్భంగా హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెడ్‌ జోన్లలో ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేనందున వారి కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు భౌతిక దూరం పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని అన్ని రెడ్‌ జోన్లలో ఇవి అందుబాటులో ఉంటాయని సుచరిత చెప్పారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వలస కూలీలను సొంతూళ్లకు పంపే విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోలేమని హోంమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. వారికి భోజన, వసతి పరంగా సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సమస్యలున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ఆమె స్పందించారు. క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలున్న మాట వాస్తవమేనని.. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని