వారి కష్టాల్ని గుర్తించి ఆదుకోండి: పవన్‌

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Published : 30 Jun 2020 01:05 IST

అమరావతి: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. నాలుగు నెలలుగా జీతాలు లేక వారంతా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీతాల్లేక కొందరు పండ్లు, కూరగాయలు అమ్ముకొంటున్నారని  ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్‌ విద్యా సంస్థలు సైతం సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బోధనా వృత్తి నుంచి హాకర్లు, కూలీలుగా మారిపోవడం బాధాకరమన్నారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని పవన్‌ కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని