ఇంకెప్పుడు మేల్కొంటారు?: కపిల్‌ సిబల్‌

రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వేడి రాజుకున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంలో చురుకుగా వ్యవహరించాలని పార్టీని కోరారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలతో............

Published : 13 Jul 2020 01:04 IST

దిల్లీ: రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వేడి రాజుకున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో చురుకుగా వ్యవహరించాలని పార్టీని కోరారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి సచిన్‌ పైలట్‌ హస్తినకు చేరుకున్న నేపథ్యంలో కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు.

‘‘మన గుర్రాలు కళ్లెం తెంపుకొని వెళ్లిపోయాక మేల్కొందామా?’’ అంటూ ఘాటుగా స్పందించారు. తన బాధ అంతా తమ పార్టీ గురించేనని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్‌ అధినాయకత్వం చురుగ్గా వ్యవహరించలేకపోయిందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఇప్పుడు రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ వ్యవహారంలోనూ అదే రీతిలో పరిణామాలు జరుగుతున్న వేళ ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం మేల్కోవాలంటూ కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని