సమస్యలు చెబుతుంటే పట్టించుకోరా?

మా సమస్యలు చెబుతుంటే పట్టించుకోకుండా వెళతారేమిటని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును అన్నపూర్ణ అనే మహిళ నిలదీశారు.

Updated : 02 Feb 2023 08:23 IST

ఎమ్మెల్యే వెలంపల్లిని నిలదీసిన మహిళ

విజయవాడ(చిట్టినగర్‌), న్యూస్‌టుడే: మా సమస్యలు చెబుతుంటే పట్టించుకోకుండా వెళతారేమిటని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును అన్నపూర్ణ అనే మహిళ నిలదీశారు. ఏ సమస్య గురించి అడిగినా చేయడానికి కుదరదని సమాధానం చెబితే ఎలా...? రక్షణ గోడ నిర్మించమంటే కాంట్రాక్టర్లు కొండపైకి రావడం లేదని చెబుతున్నారు...కుక్కల విషయం అడిగితే దాటవేస్తున్నారు...కాలువలు బాగు చేయరు...విద్యుత్తు స్తంభాలు వేయరు...చెత్త తీసుకుపోరు..కొండప్రాంతంలో నివసించే వారిని పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. తమకు పింఛన్లు ఆపేశారని...వీధి దీపాలు ఏర్పాటు చేయాలని...బోరు పంపుల మరమ్మతులు చేయాలని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. విజయవాడ ప్రైజర్‌పేట కొండప్రాంతంలో బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు స్పందిస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని