మంగళగిరి వైకాపా ఎమ్మెల్యేకి నిరసన సెగ

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఉండవల్లి అంబేడ్కర్‌నగర్‌లో తాగునీటి పథకానికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు బుధవారం ఆయన వచ్చారు.

Published : 09 Feb 2023 03:07 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఉండవల్లి అంబేడ్కర్‌నగర్‌లో తాగునీటి పథకానికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు బుధవారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా తెదేపా, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. కారు దిగివచ్చిన ఆయన మహిళలతో మాట్లాడుతుండగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రాయపూడి కిరణ్‌, మరికొంతమంది రాజధాని ద్రోహి ఎమ్మెల్యే.. ఆర్కే డౌన్‌ డౌన్‌, దళిత ద్రోహి ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. స్థానిక మహిళలు చెబుతున్న సమస్యలను ఎమ్మెల్యే వింటుండగానే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా ఆయన మహిళల సమస్యలు విని కారెక్కగానే ఏమైనా ఉంటే చెప్పమని రాయపూడి కిరణ్‌ని పోలీసులు అడగగా అన్నీ ఆయనకు తెలుసునని సమాధానమిచ్చారు. ఓట్లు వేయించుకుని మట్టి క్వారీ అంతా తవ్వుకుంటున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని