బజరంగ్‌ దళ్‌ను నిషేధించాలన్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ ఆగ్రహం

కర్ణాటకలో బజరంగ్‌దళ్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేసిన ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అర్షద్‌ మదానిపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Published : 23 May 2023 04:29 IST

ముస్లింలు పాక్‌కు వెళ్లాలని మండిపాటు

పట్నా: కర్ణాటకలో బజరంగ్‌దళ్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేసిన ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అర్షద్‌ మదానిపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ ప్రిన్సిపాల్‌ మదాని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశాన్ని ప్రస్తావించారు. 70 ఏళ్ల క్రితమే ఇటువంటి చర్య తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందిస్తూ...‘దేశ విభజన సమయంలో ముస్లింలందరినీ పాకిస్థాన్‌కు పంపించి వేయాల్సింది’ అని సోమవారం పట్నాలో అన్నారు. టిప్పు సుల్తాన్‌కు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించడాన్నీ గిరిరాజ్‌ సింగ్‌ తప్పుపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని