VenkataRamana Reddy: కూల్‌డ్రింక్‌ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి?

‘ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఆస్తులు లేవు సరే. చిన్నప్పటి నుంచి నువ్వు కూర్చునే కూల్‌డ్రింక్‌ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి? ఆయన పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి? అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

Updated : 10 Jul 2023 07:57 IST

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

ఈనాడు, నెల్లూరు: ‘ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఆస్తులు లేవు సరే. చిన్నప్పటి నుంచి నువ్వు కూర్చునే కూల్‌డ్రింక్‌ షాపు యజమానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి? ఆయన పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి? ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు? వారు మీ మనుషులు కాదా?’ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చిరంజీవికి, ఎమ్మెల్యే అనిల్‌కు దగ్గరి సంబంధాలున్నాయని, విశాఖపట్నంలో చిరంజీవి పెళ్లికి ఎమ్మెల్యే హాజరయ్యారని ఆరోపించారు. దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెబితే ఆ పాపం కుటుంబాలకు తగులుతుందన్నారు. 2017 ఆగస్టులో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అనిల్‌ను ఎందుకు విచారించారో చెప్పాలన్నారు. బెట్టింగ్‌కు సంబంధం లేదంటున్న అనిల్‌, ఇటీవల తన బాబాయ్‌ రూప్‌కుమార్‌ పాపం మోస్తున్నానని చెప్పారని... వాస్తవానికి బాబాయ్‌, అబ్బాయ్‌ కలిసే ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ‘అనిల్‌కు ఇంటర్నేషనల్‌ నోటీసులు ఎందుకు వచ్చాయి? పెరూలో బంగారం వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి. ముదివర్తిపాళెం కాజ్‌వే పనులకు సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కంపెనీతో టెండర్‌ వేయించలేదా? దొంగ బ్యాంకుగ్యారంటీతో టెండర్లు వేసిన విషయం వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు