Talasani: పొరపాటు జరిగింది.. క్షమించండి: మంత్రి తలసాని

ఇటీవల హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగిన స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదం కావడం తెలిసిందే.

Updated : 26 Aug 2023 09:24 IST

సనత్‌నగర్, న్యూస్‌టుడే: ఇటీవల హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగిన స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై శుక్రవారం మారేడుపల్లిలోని ఆయన నివాసంలో వివరణ ఇచ్చారు. జనం రద్దీ ఉన్న కార్యక్రమంలో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని, ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని తెలిపారు. అతను గిరిజనుడు భైంసా ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని, క్షమాపణ చెప్పానని తెలిపారు. ఈ ఘటనపై అతనితో పాటు గిరిజన సమాజానికి క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల గొంతుకనని తెలిపారు. ఈ సంఘటనపై తనతో ఎమ్మెల్సీ దండె విఠల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు మాట్లాడారన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని