Akula Lalitha: భారాసకు ఆకుల లలిత రాజీనామా

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత భారాసకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు.

Published : 17 Oct 2023 08:22 IST

టీఎస్‌డబ్ల్యూసీడీసీ ఛైర్‌పర్సన్‌ పదవికి కూడా..

ఈనాడు, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత(Akula Lalitha) భారాసకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీడీసీ) ఛైర్‌పర్సన్‌ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘‘భారాస హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోంది. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారింది. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ అంశాలు నన్ను బాధించాయి. ఈ నేపథ్యంలోనే భారాసను వీడుతున్నా. మీ నాయకత్వంలో ఆరేళ్ల పాటు పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న లలిత, ఆమె భర్త రాఘవేందర్‌తో కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఆమె గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని