Jagga Reddy: ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు: జగ్గారెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Updated : 04 Jan 2024 09:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘‘ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పాను. ఇక సంగారెడ్డిలో పోటీచేయను. సంగారెడ్డిని వదిలేసి రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం పనిచేస్తాను. నేను అందుబాటులో ఉండనని భారాస చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలి? వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేయాలని నాకైతే లేదు. పార్టీ ఏం నిర్ణయిస్తే అది జరుగుతుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పరోక్షంగా చెప్పారు.

ఇందిరాభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో జగ్గారెడ్డి అరగంటసేపు ఉన్నారు. ఆ తరవాత బయటికి వచ్చి గాంధీభవన్‌లో కూర్చున్నారు. సమావేశం ముగిసేముందు మళ్లీ వెళ్లారు. పీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవిని గుర్తుపట్టని పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారితో ఆయన వాగ్వాదానికి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని