KCR: ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ వచ్చే నెల 1న గజ్వేల్‌ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కు శనివారం ఆయన లేఖ రాశారు.

Updated : 28 Jan 2024 09:22 IST

శాసన సభాపతికి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ వచ్చే నెల 1న గజ్వేల్‌ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే కేసీఆర్‌ ప్రమాదవశాత్తు కిందపడి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే గురువారం శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని