రాజేష్‌నాయుడి స్ఫూర్తిగా డబ్బులు తిరిగి రాబట్టుకోవాలి: రఘురామ

టికెట్ల కోసం డబ్బులు ధారపోసి మోసపోయిన వైకాపా నాయకులు రాజేష్‌నాయుడిని స్ఫూర్తిగా తీసుకొని మీడియా ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.

Updated : 14 Mar 2024 08:22 IST

వైకాపా నాయకులకు ఎంపీ రఘురామకృష్ణరాజు సూచన

ఈనాడు, దిల్లీ: టికెట్ల కోసం డబ్బులు ధారపోసి మోసపోయిన వైకాపా నాయకులు రాజేష్‌నాయుడిని స్ఫూర్తిగా తీసుకొని మీడియా ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో టికెట్ల కోసం ఎంతోమంది నుంచి వైకాపా నాయకత్వం డబ్బులు వసూలు చేసింది. డబ్బులిచ్చిన వారు తిరిగి రాబట్టుకోవాలంటే రాజేష్‌నాయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంత్రి విడదల రజినిని గుంటూరుకు బదిలీ చేశాక చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రాజేష్‌నాయుడిని నియమించారు. టికెట్‌ కోసం తననుంచి రూ.ఆరున్నర కోట్లు వసూలు చేసినట్లు రాజేష్‌ మీడియా ముందు వాపోయారు. పెద్ద మనసు చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి రూ.మూడు కోట్లు తిరిగి ఇచ్చారట. మిగిలిన రూ.మూడున్నర కోట్లు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయి. టికెట్ల కోసం డబ్బులిచ్చి మోసపోయినవారు సగం డబ్బులనైనా రాబట్టుకోవాలంటే రాజేష్‌నాయుడు తరహాలో మీడియా ముందుకొచ్చి వాస్తవాలను చెప్పాలి’ అని ఆయన కోరారు. తనను నరసాపురం నుంచి తప్పించాలని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరబోవని ధీమా వ్యక్తం చేశారు. తాను తప్పకుండా నరసాపురంనుంచే పోటీ చేస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని