అది మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికుల జాబితా

వైకాపా తరఫున పోటీచేసే అభ్యర్థులను మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికులుగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభివర్ణించారు.

Updated : 17 Mar 2024 05:53 IST

వైకాపా అభ్యర్థుల ప్రకటనపై లోకేశ్‌ స్పందన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా తరఫున పోటీచేసే అభ్యర్థులను మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికులుగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభివర్ణించారు. వారి జాబితానే సీఎం జగన్‌ శనివారం ప్రకటించారని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని లోకేశ్‌ కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా నివాళి అర్పించారు. ఆయన ఆశయసాధన కోసం అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం గారూ ఇదేం పద్ధతి..

బడుగుల్ని గుమ్మం బయట నుంచోబెట్టడమేనా మీ సామాజిక న్యాయం? అని సీఎం జగన్‌ను లోకేశ్‌ ప్రశ్నించారు. ‘బడుగుల్ని బానిసత్వంలో భాగస్వాముల్ని చేయడం మీ లెక్క. వారిని పాలనలో భాగస్వామ్యం చేయడం మా లెక్క’ అని ఎక్స్‌లో తెలిపారు. మీడియా ముందు వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ను తన పక్కన కూర్చొబెట్టుకొన్న జగన్‌.. మీడియా వెనక ఆయన్ను దూరంగా ఉంచారని తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ‘సామాజిక రాజకీయం కాదు.. సామాజిక న్యాయం చేయాలి’ అని పేర్కొన్నారు.
.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని