వైకాపాలో ‘అనంత’ విన్యాసాలు.. అక్కడ ఆయనే స్టార్‌ క్యాంపెయినర్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్యకేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వైకాపాకు స్టార్‌ క్యాంపెయినర్‌ మాదిరి వ్యవహరిస్తున్నారు.

Updated : 20 Mar 2024 08:21 IST

కాకినాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్యకేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వైకాపాకు స్టార్‌ క్యాంపెయినర్‌ మాదిరి వ్యవహరిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరులో తెదేపా నాయకుడు శెట్టి సత్తిబాబుతో పాటు పలువురు వైకాపాలో చేరారు. దీనికోసం మంగళవారం నిర్వహించిన సభకు ఆ పార్టీ ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌తో కలిసి ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గజమాల సత్కారం అందుకున్నారు. నియోజకవర్గంలో జరిగే వైకాపా సభలు, ఆత్మీయ సమావేశాల్లో అనంతబాబు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. సుబ్బారావుకు ఆయన సమీప బంధువు కావడంతో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు