అమర్నాథ్‌గౌడ్‌ను తగలబెట్టినప్పుడు సీఎం ఎందుకు స్పందించలేదు?

తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని వైకాపా నేతల్ని ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ గౌడ్‌ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి సజీవ దహనం చేస్తే.. సీఎం జగన్‌ ఎందుకు స్పందించలేదని తెదేపా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నిలదీశారు.

Published : 16 Apr 2024 02:59 IST

ఇప్పుడు గులకరాయి తగిలితేనే గోల చేస్తున్నారు
తెదేపా మాజీ ఎంపీ నారాయణ మండిపాటు

ఈనాడు, అమరావతి: తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని వైకాపా నేతల్ని ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ గౌడ్‌ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి సజీవ దహనం చేస్తే.. సీఎం జగన్‌ ఎందుకు స్పందించలేదని తెదేపా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నిలదీశారు. గులకరాయి తగిలితే ఇప్పుడు ఇంత గోల చేస్తున్నారే.. అప్పుడు కనీసం బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. బీసీలవి ప్రాణాలు కాదా? అని సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేపల్లె నియోజకవర్గంలో వైకాపా గూండాలు అమర్నాథ్‌ గౌడ్‌ అనే పదో తరగతి విద్యార్థి సోదరిని వేధింపులకు గురిచేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ విద్యార్థి వారిని ప్రశ్నించారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అని వైకాపా నేత వెంకటేశ్వరరెడ్డి, ఆయన రౌడీ గ్యాంగ్‌ అమర్నాథ్‌ గౌడ్‌ను కింద పడేసికొట్టి.. పెట్రోలు పోసి తగలబెట్టారు. అనంతరం వారి ఇంటికి వెళ్లి అమర్‌నాథ్‌ కుటుంబాన్ని బెదిరించారంటే ఆయనకు ప్రభుత్వ అండ లేకుంటే ఇది సాధ్యపడుతుందా?’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని