భాజపా 12వ జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికలకు 12వ విడత అభ్యర్థుల జాబితాను భాజపా మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఏడుగురి పేర్లు ఉన్నాయి.

Updated : 17 Apr 2024 06:14 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు 12వ విడత అభ్యర్థుల జాబితాను భాజపా మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఏడుగురి పేర్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతారా నుంచి ఛత్రపతి శివాజీ వారసుడు ఉదయన్‌రాజే భోంస్లే కమలదళం తరఫున పోటీ చేయనున్నారు. ఖదూర్‌ సాహిబ్‌ (పంజాబ్‌)లో మంజీత్‌ సింగ్‌ మన్నా మియావింద్‌, హోశియార్‌పుర్‌లో కేంద్రమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ బదులు ఆయన సతీమణి అనిత, బఠిండాలో మాజీ ఐఏఎస్‌ పరంపాల్‌ కౌర్‌ సిద్ధూ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఠాకుర్‌ విశ్వదీప్‌ సింగ్‌, దేవరియాలో శశాంక్‌ మణి త్రిపాఠిలను భాజపా తమ అభ్యర్థులుగా ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గంలో మమతా బెనర్జీ మేనల్లుడు, సిట్టింగ్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌)కి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురవనుంది! ఆయనపై సీనియర్‌ నేత అభిజీత్‌ దాస్‌ను భాజపా బరిలో దింపింది. ఆయన గతంలో దక్షిణ 24 పరగణాలు జిల్లా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. అభిజీత్‌ 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో డైమండ్‌ హార్బర్‌లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తృణమూల్‌కు ఇది కంచుకోటలాంటి స్థానం. ప్రస్తుతం ఇక్కడ వామపక్ష కూటమి తరఫున సీపీఎం నేత ప్రతికుర్‌ రెహమాన్‌ బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని