కుటుంబ పార్టీల పాలనతో రాష్ట్రం అధోగతి: సోము వీర్రాజు

కుటుంబ పార్టీల పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ప్రధాన మంత్రి నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బాపట్లలోని భాజపా జిల్లా కార్యాలయంలో

Published : 26 Sep 2022 04:49 IST

బాపట్ల, న్యూస్‌టుడే: కుటుంబ పార్టీల పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ప్రధాన మంత్రి నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బాపట్లలోని భాజపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొలిక్కి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి ఆర్థికంగా చితికిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో సాయం చేస్తున్నా.. ఆ విషయం ప్రజలకు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరిట మైండ్‌ గేమ్‌ ఆడుతూ వైకాపా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి కమల, జిల్లా ప్రధాన కార్యదర్శులు జగన్నాథశాస్త్రి, మోహన్‌గౌడ్‌, గణేష్‌బాబు, రామకృష్ణ, మంగతాయారు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని