మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదు

మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

Updated : 07 Oct 2022 06:43 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల చివరి రోజు బుధవారం విజయవాడ దుర్గమ్మను ఆయన కుటుంబంతో సహా వచ్చి దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి అమ్మవారికి చీర, కానుకలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ప్రజాసంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. అన్ని పార్టీల మద్దతుతోనే రాజధాని ప్రకటన చేశాం. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టిని తీసుకొచ్చి అందరినీ భాగస్వాములను చేశాం...’ అని పేర్కొన్నారు. ప్రస్తుత అధికార వైకాపా కూడా తాము ఇక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఇదే రాజధాని అని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిది కాదని, అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదన్నారు. దుర్గగుడిలో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని