Telangana News: రెండోసారి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా ఎన్నిక

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

Updated : 14 Mar 2022 16:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సుఖేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో మండలి ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అనంతరం సుఖేందర్‌రెడ్డి ఛైర్మన్‌ స్థానంలో కూర్చొన్నారు. ఆయనకు మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం, స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ పదవుల్లో రైతు బిడ్డలు ఉండటం గర్వకారణమన్నారు. అత్యున్నత పదవుల్లో రైతులు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని చెప్పారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి కౌన్సిల్‌ను నడిపారని.. ఇప్పుడూ అదే పద్ధతిలో నడిపించాలని కోరుతున్నట్లు కేటీఆర్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని