ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ లేఖ

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

Published : 09 Mar 2024 20:08 IST

హైదరాబాద్‌: ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ‘‘ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే దోపిడీ అని గతంలో మీరన్నారు. ఇవాళ ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మీరు అసెంబ్లీలో చెప్పిన మాట వాస్తవమే అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని