Venkaiah Naidu: కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారు: వెంకయ్య

రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు.

Updated : 08 Oct 2023 16:13 IST

హైదరాబాద్‌: రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. భుజంమీద కండువా మార్చినంత సులభంగా నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు ప్రమఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు..  ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో ఫలవంతమైన చర్చలు జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావటం ద్వారా భవిష్యత్తు తరాలకు మరింత ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు బ్యాక్‌ గ్రౌండ్‌ అవసరం లేదని.. అందులో రాణించేందుకు అధ్యయనం చేయాలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని