
Updated : 03 May 2021 16:56 IST
Nandigram:కౌంటింగ్‌పై దీదీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: తాను ఓడినా ఒంటి చేత్తో తన పార్టీకి అపూర్వ విజయం సాధించిపెట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై సందేహాలు వ్యక్తంచేశారు. 4గంటల పాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పిందన్నారు. తాను గెలిచినట్టు తెలిసి గవర్నర్ కూడా అభినందనలు తెలిపారని దీదీ చెప్పారు. రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్‌వోను బెదిరించారని వ్యాఖ్యానించారు. రీకౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్‌వో అన్నట్లు తనకు తెలిసిందన్నారు. తనకు ప్రాణాపాయం ఉన్నట్టు ఆర్‌వో ఎవరికో చెప్పారని, ఆర్‌వో లేఖ రాసిన విషయం ఒకరు తనకు ఎస్‌ఎంఎస్ పంపారని దీదీ తెలిపారు.
ఇవీ చదవండి
Tags :