Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు బాధాకరం: మంత్రి పువ్వాడ

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.

Updated : 14 Sep 2023 20:07 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టు సరికాదన్నారు. ‘‘ముఖ్యమంత్రులు పాలనలో అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజావసరాల కోసం సీఎంలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు మంచివి కాదు’’ అని మంత్రి పువ్వాడ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని