విశాఖ ఉక్కుపై పునరాలోచించండి: వైకాపా

వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్ప బుధవారం కేంద్ర ఉక్కు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.

Published : 10 Mar 2021 13:38 IST

దిల్లీ: వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్ప బుధవారం కేంద్ర ఉక్కు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో  ప్రారంభమైన నిరసనలు  తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. స్టీలుప్లాంటు ఉద్యోగుల ఆందోళన, ఆగ్రహం, నిరసనలతో మంగళవారం విశాఖ నగరం హోరెత్తింది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులను దిగ్బంధించడంతో రవాణా స్తంభించింది. ఉన్నతాధికారులు ఎవరూ కదలకుండా స్టీలుప్లాంటులోని పరిపాలన భవనాన్ని చుట్టుముట్టి, దారులు మూసేశారు. అదే సమయంలో అక్కడికొచ్చిన డైరెక్టర్‌ వేణుగోపాలరావును 6 గంటల పాటు నిర్బంధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని