Kadiyam Srihari: ఆ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది: ఎమ్మెల్యే కడియం

అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరిస్తోందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

Updated : 21 Dec 2023 12:01 IST

హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరిస్తోందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఈ మేరకు ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

‘‘హైదరాబాద్‌ సభలో పాల్గొని ప్రియాంకా గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిండు సభలో నిరుద్యోగభృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారు. పంట రుణాలు తీసుకోని వాళ్లు.. బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని కడియం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని