MLC Kavitha: జీవో నంబర్ 3ని రద్దు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

ఆడబిడ్డల ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని భారాస ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు.

Updated : 08 Mar 2024 16:39 IST

హైదరాబాద్‌: ఆడబిడ్డల ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని భారాస ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఆమె దీక్ష చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ధర్నా చేసే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. సోనియా, ప్రియాంకా గాంధీలు పార్లమెంట్‌కు వెళ్లాలి.. కానీ, తెలంగాణ బిడ్డలు వంటింట్లో కుర్చోవాలా?అని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని