Telangana Police: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. నిందితులకు 41 సీఆర్‌పీసీ నోటీసులు

‘తెరాస ఎమ్మెల్యేకు ఎర’ కేసులో నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లకు మొయినాబాద్‌ పోలీసులు సూచించారు.

Updated : 28 Oct 2022 12:46 IST

హైదరాబాద్‌: ‘తెరాస ఎమ్మెల్యేకు ఎర’ కేసులో నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లకు మొయినాబాద్‌ పోలీసులు సూచించారు. గురువారం రాత్రే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.

భాజపాలో చేరాలంటూ తెరాసకు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్‌, పినపాక ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని