‘నియంతలా వ్యవహరించడం జగన్‌కు తగదు’

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు..

Published : 30 Apr 2021 16:15 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. అక్కడికి చేరుకునేందుకు బస్సు, ఆటోనో పట్టుకుని రావాల్సిందే కదా అని నిలదీశారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు చొరవ చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలా వ్యవహరించడం జగన్‌మోహన్‌రెడ్డికి తగదన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గించి చూపించొద్దన్నారు. పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని