Nara Lokesh: మరో రెండు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం: నారా లోకేశ్‌

మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Updated : 20 Feb 2024 13:05 IST

మాడుగుల: మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్‌ అని విమర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల శంఖారావం సభలో లోకేశ్‌ మాట్లాడారు.

‘‘మరో రెండు నెలల్లో తెదేపా- జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత నాది. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు తీసుకురావడం కాదు.. ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి. పాలిచ్చే ఆవును వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం.. పాలిచ్చే ఆవు తెలుగుదేశం. ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన మంత్రి బూడి ముత్యాలనాయుడిని గెలిపిస్తే.. ఉత్తరాంధ్రకు ఆయనేం చేశారు?ఐదేళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా.. ఒక్క గుంత అయినా పూడ్చారా? వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి నిల్‌.. అవినీతి ఫుల్‌. ఇష్టమొచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తెదేపా-జనసేనను గెలిపించండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా.. పనిచేసేవాళ్లనే ప్రోత్సహిస్తా. ప్రజల్లో ఉంటూ పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం. బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి’’ అని లోకేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని