Nellore: నెల్లూరులో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్న అధికారులు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Published : 19 Dec 2023 12:26 IST

నెల్లూరు: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు ఈ ధర్నాను అణచివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్నారు. ఏఎస్‌పేటలో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించారు. ఆత్మకూరులోని ఎల్‌.ఆర్‌.పల్లిలో స్థానికులు అడ్డుకోవడంతో.. అధికారులు, వాలంటీర్లు వెనుదిరిగారు.

తాళాలు పగలగొట్టడం చట్ట విరుద్ధం: సీపీఎం

అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్నారని.. తాళాలు పగల గొట్టడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని