YSRCP: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురు దెబ్బ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 10 Apr 2024 22:56 IST

విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా సీనియర్‌నేత, కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్‌ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దుర్గగుడి ఛైర్మన్‌గా కొనసాగించమని కోరితే.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ సహకరించలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు వైకాపా టికెట్‌ ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు కేశినేని నాని తనను ప్రచారానికి కూడా రమ్మని కోరలేదన్నారు. వైకాపాలో తనకు జరిగిన అవమానాలతో బాధపడి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని సోమినాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని