
Pawan Kalyan: కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి: పవన్ కల్యాణ్
అనంతపురం: వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందజేసిన తర్వాత మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.
‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. వారి కష్టం కళ్లారా చూశా. మరో దారి లేకపోతేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుంది. రైతు కష్టం తెలుసుగనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నా. కౌలు రైతుల కష్టాలను పంచుకుంటాం. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం. పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారు. రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. వారి బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే... ఏసీ గదుల్లో కూర్చుని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడే.. ఈ క్షణమే ఏర్పాటు చేస్తున్నాం. సంక్షేమ నిధిలో సగం డబ్బు నేనిస్తాను, మిగిలిన సగం మా పార్టీ నేతలు ఇస్తామని మాట ఇచ్చారు.
కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు తొలుత మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమంది చనిపోయారని మేం ఆర్టీఐ ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నాం. జనసేన కార్యకర్తల ద్వారా పూర్తి వివరాలు సేకరించాం. వీటన్నింటినీ క్రోడీకరించాం. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు ఎంతమంది చనిపోయారు అంటే.. ఆ జాబితా జనసేన వద్ద ఉంది. ప్రభుత్వం వద్ద కూడా లేదు. అధికారంలోకి వస్తే మీ కన్నీరు తుడుస్తాం. నన్ను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అంటాం. వైకాపా నాయకులు చాలా మందిని సీబీఐ ప్రేమగా దత్తత తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేం ఎవరికీ బీ టీమ్ కాదు.. ఇంకోసారి అలా అంటే చర్లపల్లి షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. నేను ఎవరికీ భయపడను. నాకు స్వార్థం లేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!
-
India News
Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
-
Movies News
Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
-
World News
Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య