PM Modi: దేశ వ్యతిరేక అజెండాకు ఆజ్యం పోయడమే వారి సిద్ధాంతం: విపక్ష కూటమిపై మోదీ ఫైర్‌

అవినీతి, దుష్పరిపాలన, దేశ వ్యతిరేక అజెండాకు ఆజ్యం పోయడమే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Published : 15 Mar 2024 00:09 IST

దిల్లీ:  విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శలు గుప్పించారు. అవినీతి, దుష్పరిపాలన, దేశ వ్యతిరేక అజెండాకు ఆజ్యం పోయడమే ఆ కూటమి అజెండా అన్నారు.  దేశ రాజధాని నగరంలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం రేయింబవళ్లు పని చేస్తోందని మోదీ అన్నారు. దిల్లీలో ‘పీఎం స్వనిధి’ పథకం లబ్ధిదారుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు వీధి వ్యాపారుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దీంతో వారు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. బ్యాంకుల్లో రుణాలూ లభించేవి కాదన్నారు. కానీ భాజపా ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి మారిందని..  లక్షలాది వీధి వ్యాపారుల కుటుంబాలకు స్వనిధి పథకం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని చెప్పారు. 62 లక్షల మందికిపైగా రూ.11 వేల కోట్ల రుణాలు అందించామన్నారు.

‘ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు, ఫొటో వాడకండి’

అవినీతి, బుజ్జగింపు రాజకీయాల నిర్మూలనే తమ లక్ష్యమని చెప్పిన ప్రధాని మోదీ.. ప్రజా సంక్షేమం ద్వారా దేశాన్ని సంక్షేమ పథకంలో తీసుకెళ్లడమే తన సిద్ధాంతమన్నారు.  దేశంలోని నగరాల్లో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి, కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిజాయతీగా కృషి చేస్తున్నామన్నారు. దిల్లీలో వెయ్యికి పైగా ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటుతో పాటు నగరం చుట్టూ ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణ, మెట్రో నెట్‌వర్క్‌ పెంచడం తదితర అంశాలను ప్రస్తావించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని