Rahul Gandhi: అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో రాహుల్ స్వచ్ఛంద సేవ

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు.

Published : 02 Oct 2023 15:50 IST

Image : VikasKumar_INC

అమృత్‌సర్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని (Golden Temple) సందర్శించారు. ఆధ్యాత్మిక సందర్శనలో భాగంగా ఆయన తన తలకు బ్లూ స్కార్ఫ్‌ ధరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు. అనంతరం భజన బృందం సభ్యులతోపాటు కూర్చొని గుర్బానీ కీర్తనలు విన్నారు. ఈ పర్యటన కోసం రాహుల్ ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌ చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. గత జనవరిలోనూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించారు. 

సీఐడీ పేరు మార్చుకొని ‘జేపీఎస్‌’గా పెట్టుకోవాలి: సీపీఐ రామకృష్ణ

అంతకముందు రాహుల్ పర్యటన గురించి వివరిస్తూ పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజా వారింగ్‌ ట్విటర్‌ (ఎక్స్‌)లో పోస్టు పెట్టారు. ‘రాహుల్ గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ సాహిబ్‌కు వస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత, ఆధ్యాత్మిక యాత్ర. కాబట్టి ఆయన గోప్యతను మనం గౌరవించాలి. ఆయనను కలిసేందుకు పార్టీ కార్యకర్తలెవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి పర్యటనకు వచ్చిన సమయంలో మీరంతా సమావేశమయ్యే ఏర్పాట్లు చేస్తామని’ అందులో పేర్కొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని