ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్‌ల ఫిర్యాదు.. విచారణ జరిపిస్తామన్న కేంద్రమంత్రి

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సర్పంచ్‌లు సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Updated : 02 Aug 2023 17:29 IST

దిల్లీ: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సర్పంచ్‌లు సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ నేతృత్వంలో కేంద్ర మంత్రి కపిల్‌ పాటిల్‌ను కలిసిన సర్పంచ్‌లు.. సంతకాలు లేకుండా రూ.8,860కోట్లు  ప్రభుత్వం వాడుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 12,998 పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లుల పేరుతో నిధులు మళ్లించుకున్నారని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి  సమగ్ర విచారణ జరిపిస్తామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. నరేగా నిధులనూ వినియోగించుకోనివ్వట్లేదని సర్పంచ్‌లు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని