Nellore: చిమ్మచీకట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి నిరసన.. పొదలకూరులో ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా పొదలకూరులోని భారత్‌ మైకా మైన్స్‌లో వైకాపా నేతలు 3 వారాలుగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 16 Dec 2023 20:46 IST

పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరులోని భారత్‌ మైకా మైన్స్‌లో వైకాపా నేతలు 3 వారాలుగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. రోజుకు రెండు వేల టన్నుల క్వార్జ్ట్‌ను దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్‌ను ఆపాలని కోర్టు ఆదేశించినా.. పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైకాపా నేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దోపిడీ చేసిన సొత్తును రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద వసూలు చేయాలన్నారు. భారత్‌ మైకా దోపిడీ ఆపేవరకూ మైనింగ్‌ ప్రాంతంలోనే కూర్చుంటానని అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అధికారులు వచ్చే వరకు వాహనాలను బయటకు వెళ్లనీయమని తేల్చి చెప్పారు. సోమిరెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతానికి స్థానిక ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. రాత్రి సమయంలో కూడా నిరసన కొనసాగుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని