Gudivada: కొడాలి నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలి: సునీల్ దియోధర్
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సమస్యలపై నిర్వహించిన భాజపా ఛార్జ్‌షీట్ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ పాల్గొన్నారు.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సమస్యలపై నిర్వహించిన భాజపా ఛార్జ్‌షీట్ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను సైతం క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని, గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
కొడాలి నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు సునీల్ దియోధర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామన్నారు. బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని, ఇలాంటి ఎమ్మెల్యేల కారణంగా ఏపీ పరువుపోతోందన్నారు. అనంతరం గుడివాడ సమస్యలపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో భాజపా నేతలు ఛార్జ్‌షీట్ ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.