Akhilesh Yadav: కాంగ్రెస్‌పై అదో పెద్ద బాధ్యత.. అఖిలేశ్‌ కీలక వ్యాఖ్యలు

కూటమిలో చిన్న చిన్న పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

Published : 27 Jan 2024 02:19 IST

కన్నౌజ్‌: ‘ఇండియా’ కూటమిలో ప్రస్తుతం నీతీశ్‌ కలకలం కొనసాగుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వంటి నేతలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని, చిన్న పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఎంతగానో ఉంటుందని పేర్కొన్నారు. 

సంకీర్ణంతో విభేదాల వేళ.. గవర్నర్‌ నివాసానికి నీతీశ్ కుమార్‌

కన్నౌజ్‌లోని ఫకిర్‌పుర గ్రామంలో జన్‌ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఎన్డీయే కూటమితో మళ్లీ కలుస్తారని తాము భావించడంలేదని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు. ఆయన ఇండియా కూటమిని బలోపేతం చేస్తారని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పొత్తుల అంశంపై స్పందిస్తూ.. యూపీలో మంచి పొత్తు కుదిరింది. ఈ పొత్తు సీట్ల కోసం కాదు.. విజయం కోసమేనన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుందని అడగ్గా.. సీట్ల పంపకాల వ్యూహంలో భాగంగానే గెలుపు ఉంటుందని పేర్కొన్నారు. కన్నౌజ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని.. భాజపాను అక్కడి నుంచి తరిమికొడతామని ధీమా వ్యక్తం చేశారు. జ్ఞానవాపి సర్వే అంశంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో పెరుగుతున్నందునే ఇలాంటివి చేస్తున్నారని.. దేశ ప్రజల సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని అఖిలేశ్‌ ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని