Andhra News: నాడు-నేడు పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటున్న సీఎం: పట్టాభి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం నాన్న బుడ్డికే సరిపోతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఆనాడు ప్రతిపక్ష నేత

Published : 27 Jun 2022 15:39 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం నాన్న బుడ్డికే సరిపోతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ ఇస్తామని జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు. అమ్మఒడికి రూ.12వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. అందులో సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. 2021లో అసలు అమ్మఒడి ఇవ్వలేదని.. ఇప్పుడు ఇచ్చినా అందులో సగం కోత పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుంటే 2లక్షల మంది పదో తరగతి పిల్లలు ఎలా ఫెయిల్ అయ్యారని ప్రశ్నించారు. నాడు-నేడు కార్యక్రమం పేరుతో రూ.వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని