Telangana BJP: తెలంగాణలో పలు జిల్లాల భాజపా అధ్యక్షుల మార్పు

భారతీయ జనతా పార్టీ (భాజపా) తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది.

Updated : 18 Jan 2024 23:03 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలు, ఆరు మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా, జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారమందించారు.

మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులు వీరే..

  • ఎస్టీ మోర్చా- కల్యాణ్‌ నాయక్‌
  • ఎస్సీ మోర్చా- కొండేటి శ్రీధర్‌
  • యువ మోర్చా- సేవెల్లా మహేందర్‌
  • ఓబీసీ మోర్చా- ఆనంద్‌ గౌడ్‌
  • మహిళా మోర్చా- శిల్ప
  • కిసాన్‌ మోర్చా- పెద్దోళ్ల గంగారెడ్డి

కొత్త అధ్యక్షులు వీరే..

  • వికారాబాద్ - మాధవ రెడ్డి
  • యాదాద్రి భువనగిరి - భాస్కర్
  • నిజామాబాద్ - దినేశ్
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని