AP News: జగన్‌ను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడు: నారాయణస్వామి

సీఎం జగన్‌ ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని.. అనవసరంగా ఆయనపై బురద చల్లుతున్నారని ఏపీ

Updated : 30 Dec 2021 15:13 IST

తిరుమల: సీఎం జగన్‌ ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని.. అనవసరంగా ఆయనపై బురద చల్లుతున్నారని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల విజయవాడ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్‌లిక్కర్‌పై చేసిన వ్యాఖ్యలను నారాయణస్వామి తప్పుబట్టారు. మద్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? అని నిలదీశారు. సీఎం జగన్‌ను జైలుకు పంపిస్తామంటూ భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ సింహమని.. ఎవరికీ భయపడరన్నారు. ఆయన్ను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని