Finance Ministry: ఆంధ్రప్రదేశ్‌ పరిమితికి మించి అప్పులు చేసింది: కేంద్ర ఆర్థిక శాఖ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను

Updated : 03 Aug 2021 10:48 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30,305 కోట్లు, కొవిడ్‌ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి రు. 49,497 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

‘దిశ’పై ఏపీ నుంచి స్పందన లేదు..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ‘దిశ’పై ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలపై వివరణ కోరినట్లు తెలిపింది. అయితే దీనిపై ఏపీ సర్కార్‌ ఇప్పటివరకు స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ వెల్లడించారు. వైకాపా ఎంపీ మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని