Kejriwal: కేజ్రీవాల్‌.. ఆలయాలను ఎందుకు సందర్శిస్తున్నారంటే..?

తాను కూడా హిందువును కాబట్టే దేవాలయాలను సందర్శిస్తున్నానని.. అందులో మిగతావారికి అభ్యంతరమేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

Published : 08 Nov 2021 01:23 IST

సాఫ్ట్‌ హిందుత్వ విమర్శలపై స్పందించిన దిల్లీ సీఎం

దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మధ్య వరుసగా ఆలయాలను కూడా సందర్శిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన హిందుత్వ వైపు సున్నితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి విమర్శలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. తాను కూడా హిందువును కాబట్టే దేవాలయాలను సందర్శిస్తున్నానని.. అందులో మిగతావారికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

‘నేను హిందువును కాబట్టి ఆలయాలకు వెళ్తాను. నా భార్య కూడా ఓ ఆలయాన్ని సందర్శించారు. దాంట్లో తప్పేముంది. ఎవరైనా ఆలయాలను సందర్శించినప్పుడు ప్రశాంతత లభిస్తుంది. వీటికి కొందరు సాఫ్ట్‌ హిందుత్వ అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను గుడికి వెళ్తే వారికేంటి అభ్యంతరం..? అంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. రెండు రోజుల గోవా పర్యటనలో ఉన్న కేజ్రీవాల్‌ సాఫ్ట్‌ హిందుత్వపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.

మరికొన్ని నెలల్లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పటికే భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు ఆమ్‌ఆద్మీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏఏపీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గోవాలో రెండు రోజుల పర్యటనతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే తీర్థయాత్రల కోసం ప్రత్యేక కార్యక్రమంతో పాటు 24గంటల ఉచిత కరెంటు, జాబ్‌ గ్యారంటీ వంటి హామీలను ప్రకటించారు. ఇక గడిచిన కొన్ని నెలల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ గోవాలో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు