AP News: కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగడం హీనం: పేర్ని 

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన శాసనసభలో రాలేదని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆమెను ఉద్దేశించి ఎవరూ ఏమీ అనలేదన్నారు. నిజంగానే

Updated : 20 Nov 2021 17:14 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన శాసనసభలో రాలేదని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆమెను ఉద్దేశించి ఎవరూ ఏమీ అనలేదన్నారు. నిజంగానే నిన్న బ్లాక్‌ డే అన్న మంత్రి నాని.. కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగి చరిత్రను హీనం చేశారన్నారు. చంద్రబాబు చెప్పేవి అసత్యాలేనని, జరగని విషయాలను ఆయన రాజకీయా ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు.

‘‘వాస్తవాలు మాట్లాడితేనే చంద్రబాబునాయుడి అనుభవానికి పరమార్థం ఉంటుంది. బాలకృష్ణ, ఆయన తోబుట్టువులు వైకాపా సభ్యులు ఏదో అనేసినట్లు మాట్లాడటం బాధాకరం. అప్పట్లో ఎన్టీఆర్‌ ఏదో చేసేస్తారని కన్నబిడ్డలనే నమ్మించి ఆయనకు వ్యతిరేకంగా మారేలా చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఇద్దరు శాసన సభ్యులు ఏదో అన్నారని సృష్టించటం, నమ్మించటం చాలా చిన్న విషయం. ఆనాడు రామారావుకు వ్యతిరేకంగా, వారి కుటుంబాన్ని నిలిపి ఆయనకు మానసిక క్షోభ కలిగించేలా, కుంగదీసేలా చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అసలు అసెంబ్లీలో గొడవకు కారణమైంది ఆయనే. వ్యవసాయంపై చర్చ జరుగుతుంటే, ఒక శాసనసభ్యుడిని ప్రేరిపించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేకపోయినా పని గట్టుకుని ఆయనపై విమర్శలు చేశారు. ‘మీ బాబాయ్‌ హత్యపై, గొడ్డలిపై, తల్లి, చెల్లిపై చర్చిద్దాం’ అని చంద్రబాబు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ఏపీ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుదామనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. నిరసన తెలపాలని ప్రజలను కోరుతున్నారు. అసలు ఎందుకు నిరసన తెలిపాలి? అర్థం పర్థం లేకుండా ఇలాంటి వాటికి పిలుపునివ్వటం ఎందుకు’’ అని పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు